- Advertisement -
చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ.
క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ట్వీట్ చేసింది ప్రధాని మోదీ కార్యాలయం.
చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ స్పందించారు. తాండూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా మన్నెగూడ నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది… ప్రమాదంలో 19 మంది చనిపోయారు అన్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, 3 నెలల పాప ఉన్నారు అని చెప్పారు.
కండెక్టర్ సమాచారం మేరకు బస్సులో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నారు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.

Also Read:బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
- Advertisement -

