దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన మోదీ.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు తీసుకొస్తున్నాం అన్నారు.
వాటిపై చర్చలకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను అన్నారు. వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని… ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కు ప్రాధాన్యత ఇస్తాం అని వెల్లడించారు.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించేందుకు కొత్త నమ్మకం, ఉత్సాహాన్ని నింపుతుందని ధైర్యం నాకు ఉందన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
రెండు విడతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు జరగనుంది. మార్చి 10న రెండో విడత ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనుంది. ఈ బడ్జెట్తో నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థికమంత్రిగా నిలవనున్నారు.
Also Read:ఉస్మానియా జనరల్ ఆస్పత్రి..ప్రత్యేకతలివే