తుంబుర వాయించిన ప్రధాని మోదీ..

60
pm modi
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ తుంబుర చేతబూని.. చిడతలను వాయించారు. ఈ దృశ్యం పూణేలోని సంత్ తుకారామ్ ఆలయంలో కనిపించింది. మంగళవారం ప్రధాని మోదీ పుణేలో పర్యటించారు. ఇక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆలయ పాలకమండలి సభ్యులు ప్రధానికి తుంబుర, చిడతలు బహూకరించారు. ఈ క్రమంలో ఆయన సరదాగా తుంబుర చేతబూనిన.. చిడతలను వాయించారు. కాగా,సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లిఖించారు. అనేక కీర్తనలను రచించారు. ఆయన మరణానంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసినా, ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు.

- Advertisement -