ఢిల్లీ లోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి బ్లాస్ట్‌లో గాయపడిన వారిని పరామర్శించారు.ఆసుపత్రిలో ఆయన బాధితులతో మాట్లాడి త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ‘ఎక్స్’ (X) లో ఒక పోస్ట్ చేశారు మోదీ. ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో కలిశాను. వారి త్వరిత ఆరోగ్యవృద్ధి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ కుట్ర వెనుక ఉన్న వారందరినీ ముందుకు తీసుకువస్తాం అన్నారు.
నవంబర్ 10న సాయంత్రం, హ్యుందాయ్ i20 కారులో లాల్కోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 12 మంది మరణించగా, సుమారు 20 మంది గాయపడ్డారు.
Also Read:అయోధ్య లక్ష్యంగా దాడులకు కుట్ర!

