మోడీ ” కథలు “.. వినండోయ్!

32
- Advertisement -

కాశీమజిలి కథలు, అల్లావుద్దీన్ అద్బుతదీపం కథలు, పెదరాసి పెద్దమ్మకథలు.. ఇలా ఎన్నో వినే ఉంటాం. వీటిలో నిజాలకు తావుండదు గాని వినడానికి మాత్రం చెవులకు ఇంపుగా ఉంటాయి. ఇలాంటి కథలను పెద్దలు పిల్లలకు సరదాగా వినిపిస్తూ బుజ్జగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్దలపై పిల్లలు అలిగినప్పుడు ఇలాంటి కథలు చెప్పి వారిని నిద్రపుచ్చుతూ ఉంటారు. సేమ్ ఇదే స్ట్రాటజీనే ప్రధాని మోడీ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ పట్ల తీవ్రమైన పక్షపాతం కనబరిచారు మోడీ. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ను పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తే తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తూ వచ్చారు. పోనీ ఏమైనా ప్రాజెక్టుల రూప కల్పన చేసి తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్నారా అంటే అది లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, వంటి జాతీయ ప్రాజెక్ట్ ల ఊసే లేదు. ఏళ్ళు గడుస్తున్న వాటి రూపకల్పనే లేదు..

అటు గుజరాత్ కేమో ఇన్ఫ్రా స్ట్రక్చర్, ప్రాజెక్ట్ లు… ఇలా అన్నీ అమలు చేస్తూ తెలంగాణ విషయంలో మాత్రం మాకేం సంబంధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రధాని మోడీ. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపు కొద్ది తెలంగాణ రావడం అది కూడా బిజెపి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం మళ్ళీ డిల్లీ చేరుకోవడం.. ఇది గత కొన్నాళ్లుగా ప్రధాని మోడీ తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు. కానీ ఈ మద్య మాత్రం కపటప్రేమ కురిపిస్తూ రాష్ట్రంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రావడానికే మొఖం చాటేసిన మోడీ.. ఇప్పుడు మాత్రం పరుగుపరుగున తెలంగాణకు వస్తున్నారు.

ఎందుకలా అంటే అందరికీ తెలిసిన సంగతే. ఎన్నికలు దగ్గరడంతో ఆల్రెడీ బిజెపికి గడ్డుకాలం ఏర్పడిందని భావించిన మోడీ రాష్ట్రనికి తరచూ వస్తూ బీజేపీకి ఊపిరి ఊదే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్క పడిన కుండలో నీళ్ళు ఎన్ని సార్లు నింపిన వ్యర్థమే అనే నానుడి తేలియందికాదు. ఇక అసలే కేంద్రప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు ఇప్పుడు కొత్తగా కథలు వల్లించడం మొదలుపెట్టారు. బి‌ఆర్‌ఎస్ ను ఎన్డీయేలో చేర్చుకోవాలని కే‌సి‌ఆర్ మోడీని అడిగినట్టు.. ఆయనేమో అందుకు నిరాకరించినట్లు.. ఇలా కొత్తగా కథలు చెబుతూ రాజకీయ లభ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రధాని మోడీ గమనించాల్సిన విషయమేమిటంటే కథలను.. ప్రజలు కథలుగానే చూస్తారనే సంగతి బహుశా ఆయన గ్రహించలేదేమో మరి. ఎలా ఎన్ని కథలు చెప్పినా.. సి‌ఎం కే‌సి‌ఆర్ పై ఎంత బురద చల్లాలని చూసిన తెలంగాణ ప్రజల్లో కే‌సి‌ఆర్ పై ఉండే విశ్వసనీయత ను దూరం చేయలేరనేది జగమెరిగిన సత్యం.

Also Read:టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి

- Advertisement -