కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రధాని అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న టెన్షన్ ఉండేదని, కరోనా టీకా వచ్చేసిందన్నారు.
కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రి, పగలు లేకుండా శ్రమించారని..చాలా తక్కువ సమయంలో టీకా వచ్చేసిందన్నారు. మేడి ఇన్ ఇండియా టీకాలు రెండు వచ్చాయన్నారు. ఇది భారత సామర్థ్యం అన్నారు. దేశం అంటే మట్టి కాదు.. దేశం అంటే మనుషులోయ్ అని తెలిపిన మోదీ.. కోవిడ్ అంతానికి ఇది ప్రారంభం అన్నారు.
డాక్టర్లు, నర్సులు, హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ టీమ్ కూడా కరోనా టీకా తీసుకునేవారిలో ముందున్నారని ప్రధాని మోదీ తెలిపారు. రెండు డోసులు వ్యాక్సిన్ తప్పనిసరి అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా టీకా పంపిణీకి సన్నద్దం అయి ఉన్నాయన్నారు. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత ముందు జాగ్రత్తలను అసలు మరవకూడదని గుర్తు చేశారు. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి అన్నారు. సురక్షితంగా తేలిన తర్వాతే వ్యాక్సిన్లకు పచ్చజెండా ఊపామని స్పష్టం చేశారు.