- Advertisement -
5జీ సేవలు దేశంలో కొత్తశకానికి నాంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 5జీ టెలికాం సేవలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోడీ..ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిలో ఇండియా దూసుకువెళ్తుందని తెలిపారు.
5జీ టెక్నాలజీ విషయంలో నవభారత్ కేవలం ఓ వినియోగదారుడిగా ఉండిపోదు అని, ఆ టెక్నాలజీ అభివృద్ధి విషయంలోనూ యాక్టివ్ పాత్ర పోషిస్తుందన్నారు. 21వ శతాబ్ధంలో భారత్‌కు ఇది చరిత్రాత్మక దినమన్నారు. టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నట్లు తెలిపారు.
5జీని ఆవిష్కరించడం అంటే.. 130 కోట్ల మంది భారతీయులకు ఇది టెలికం రంగం ఇచ్చిన గిఫ్ట్ అన్నారు. అపరిమిత అవకాశాలకు కూడా ఇది ఆరంభమే అని ప్రధాని తెలిపారు.
- Advertisement -