1990 నుంచి 2005 వరకు సాగిన జంగిల్ రాజ్ వల్ల యావత్ బిహార్ రాష్ట్రం నాశనమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ…ప్రభుత్వాన్ని నడుపుతున్నామనే పేరుతో ఖజానాను ఆర్‌జేడీ లూటీ చేసిందని ఆరోపించారు. 15 ఏళ్ల ఆర్‌జేడీ జంగిల్ రాజ్ వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు.
జంగిల్ రాజ్ కాలంలో ఎన్ని ఎక్స్‌ప్రెస్ వేలు, వంతెనలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, టూరిస్ట్ సర్క్యూట్‌లు నిర్మించారు అంటే వచ్చే సమాధానం సున్నా అని విమర్శించారు. ఆనాడు రాష్ట్రాన్ని పాలించిన వాళ్లు తమను తాము చక్రవర్తులు అనుకునేవారు కానీ మోదీ విభిన్నం అన్నారు.
నాకు ప్రజలే మాయీ-బాప్. మీరే నా శక్తి. మీరే నా మార్గదర్శకులు. ప్రజల చేతిలోనే నా రిమోట్ కంట్రోల్ ఉంది అన్నారు. రాష్ట్ర ప్రజల స్వప్నాలను, లక్ష్యాలను సాకారం చేయడమే మోదీ పని. ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. చొరబాటుదారులపై ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీలు మెతక వైఖరిని అవలంభిస్తాయి… కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శ్రీరాముడు, ఛటీ మయ్యాలను ఆ పార్టీలు ఇష్టపడవు అన్నారు.
అయోధ్యతో పాటు నిశాద్ రాజ్, మాతా శబరి, మహర్షి వాల్మీకీల పుణ్య క్షేత్రాలను దర్శించేందుకు విపక్ష నేతలు రెడీగా లేరు. వాళ్లకు దళితులు, బీసీలు అంటే ద్వేషం. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు అధికారం వస్తే, వాళ్లు చొరబాటుదారులకు వెనుక తలుపు నుంచి ఎంట్రీ కల్పిస్తారు అని ఆరోపించారు.
Also Read:ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారా?

