ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముజఫ్ఫర్‌పూర్లో నిర్వహించిన ప్రజా సభలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆర్జేడీ బీహార్‌ను ‘జంగిల్ రాజ్’ యుగంలోకి నెట్టేసిందని” ఆరోపించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆర్జేడీ పాలన అంటే — ‘కట్టా (తుపాకీ), క్రూరత (దారుణం), కటుత (విషతత్వం), కుశాసన (దుర్వ్యవస్థ), అవినీతి అనే ఐదు పదాలతో నిర్వచించవచ్చు అని అన్నారు. ఆయన ప్రజలను అభివృద్ధి, స్థిరత్వం కోసం మద్దతు ఇవ్వాలని, ఈ విధమైన రాజకీయాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
వీరు చఠ్ఠి మయ్యాను రాజకీయ లాభం కోసం అవమానించారని ఆయన ఆరోపించారు. ఎవరు ఓట్ల కోసం చఠ్ఠి మయ్యాను అవమానించగలరు? బీహార్ ప్రజలు, ఈ దేశ ప్రజలు అటువంటి అవమానాన్ని సహిస్తారా? చెప్పాలన్నారు. మా ప్రభుత్వం చఠ్ మహాపర్వ్‌ను యునెస్కో యొక్క ‘Intangible Cultural Heritage’ జాబితాలో చేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది….ఈ పండుగను ‘మానవత్వం మరియు భక్తికి ప్రతీక గా పేర్కొంటూ, దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. అర్హత ఉందని అన్నారు.
Also Read:బాల్ తాకి..యువ క్రికెటర్ మృతి

