ఇండియా బ్లాక్ కూటమికి కేరళ సీఎం పినరయి విజయన్ మూలస్తంభం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇవాళ కేరళ సీఎం విజయన్‌తో కలిసి పీఎం విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ… ఇండియా బ్లాక్ కూటమికి కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాన మూలస్తంభమని, శశి థరూర్ కూడా ఉన్నారని చెప్పారు. తన వ్యాఖ్యలతో ఈరోజు రాత్రి ఎంతో మందికి నిద్ర బంగమవుతుందని ప్రధాని చమత్కారించారు. దేశంలో ఇది గొప్పకట్టడమని, ఆధునిక యుగానికి ప్రతీక అని, ఈ రేవుతో బహుళ అవకాశాలు కలిగి ఉన్నాయన్నారు. అదే విధంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించొచ్చని తెలిపారు.
ఇక ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు విజయన్. విజింజం ప్రాజెక్టు సహకారం అందించిన ఆదానీ గ్రూప్ సంస్థకు అభినందించారు. విజింజం ఓడరేవు కేరళకు మరో మైలు రాయి నిలుస్తుందని …ఈ ప్రాజెక్టును జాతీకి అంకితం చేసినందుకు రాష్ట్రప్రజల తరుపున ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు ..
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కాంపోనెంట్‌తో అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డిసెంబర్ 5, 2015న నిర్మాణాన్ని ప్రారంభించింది.
Also Read:సురేష్ ప్రొడక్షన్స్‌కు దక్కని ఊరట..!

