ఉత్తమ చిత్రంగా కిరణ్‌…’క’!

20
- Advertisement -

థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం “క“. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటింది.

తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ లో ఉత్తమ చిత్రంగా ‘క’ అవార్డును సొంతం చేసుకుంది. ఒక తెలుగు సినిమాకు ఈ అవార్డ్‌ రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించగా నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన హిట్‌గా నిలిచింది.

Also Read:వివాదంలో హీరో విజయ్ దేవరకొండ!

- Advertisement -