ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ (10 కోట్ల) ఫాలోవర్లను దాటిన తొలి రాజకీయ నాయకుడిగా నిలిచారు. 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన మోడీ పదేళ్లుగా ఖాతాను ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అయ్యే రాజకీయ ప్రొఫైళ్లలో ఒకటిగా తీర్చిదిద్దారు.
అధికారిక కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, ప్రజా కార్యక్రమాలు, సాంస్కృతిక సందర్భాలు, వ్యక్తిగత ఆలోచనలు వంటి అంశాలను ఆయన ఈ వేదిక ద్వారా పంచుకుంటూ విస్తృత ప్రేక్షకులతో అనుసంధానం సాధించారు. ఈ విజయంతో ప్రపంచ నాయకుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ మొదటి స్థానంలో నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (15 మిలియన్), బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా (14.4 మిలియన్), టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (11.6 మిలియన్), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే (6.4 మిలియన్) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Also Read:పింక్ సాల్ట్ నిజంగా ఆరోగ్యకరమా?

