పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షల ఒత్తిడి, భవిష్యత్ లక్ష్యాలు, వ్యక్తిత్వ వికాసంపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. టెక్నాలజీ మనకు ఉపకరణంగా ఉండాలి కానీ, అదే మనలను బానిసలుగా మార్చుకునే స్థితికి వెళ్లకూడదని స్పష్టం చేశారు.
పరీక్షలు జీవితాన్ని నిర్ణయించేవి కాదని, అవి ఒక దశ మాత్రమేనని ప్రధాని అన్నారు. ఒత్తిడిని దూరం పెట్టి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అలాగే చదువును, కళలను వేరుగా చూడవద్దని సూచించారు. విద్యతో పాటు సంగీతం, క్రీడలు, చిత్రలేఖనం వంటి కళలను కూడా అలవర్చుకోవాలని తెలిపారు.
Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్
చదువు మేధస్సును పెంపొందిస్తే, కళలు సృజనాత్మకతను పెంచుతాయని అన్నారు. రెండింటినీ సమతుల్యంగా అలవర్చుకుంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని సందేశం ఇచ్చారు. పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

