పంచెకట్టుతో జిన్ పింగ్‌కు మోదీ స్వాగతం..

476
- Advertisement -

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురంలో స్వాగతం పలికారు. జిన్ పింగ్ ఈ మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి మహాబలిపురం వెళ్లారు. ఈ సందర్భంగా మహాబలిపురంలో ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.

modi

తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ పంచెకట్టుతో కనిపించడం విశేషం. అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ వివరిస్తున్నారు.

- Advertisement -