హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు..

519
congress
- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గ మంత్రులు,ఎమ్యెల్యేలు పాల్గొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ దామోదర్ గుప్తా, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సంద్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్యే గణేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. ప్రచారంలో ప్రజలంతా గులాబీ పార్టీ వైపే వస్తున్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలు, టీఆర్‌ఎస్‌కె సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. సైదిరెడ్డి గెలుపు కోసం సబ్బండ వర్గాలు కలిసి వస్తున్నాయి అని గణేష్‌ గుప్తా అన్నారు.

పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ దామోదర్ గుప్తా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉంది. హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిలించుకోవాలి అని దామోదర్ గుప్తా అన్నారు.

ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. కోదాడలో చెల్లని రూపాయి. హుజూర్‌నగర్‌లో ఎలా చెల్లుతుంది. ఉత్తమ్ పద్మావతికి ఓటమి తప్పదు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ వ్యాపారులును, భయపెట్టి ఓటు బ్యాంకుగా వాడు కున్నాడు. ఈ ఎన్నికలో ఉత్తమ్‌కు సరైన బుద్ది చెప్పాలి అన్నారు శ్రీనివాస్ గుప్తా.

- Advertisement -