రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను ప్రధానం చేశారు.
భారత ప్రజల తరపున ఈ ఏకైక గౌరవానికి ప్రెసిడెంట్ మాక్రాన్‌కు ధన్యవాదాలని భారత విదేశాంగశాఖ తెలిపింది. తాను చాలాసార్లు ఫ్రాన్స్ దేశానికి వచ్చానని, అయితే ఇది ఈసారి ప్రత్యేకమైనదని, భారతదేశం, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయని కొనియాడారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని డయాస్పోరా సభ్యులను మోడీ కోరారు.
Also Read:పవన్‌కు వాలెంటరీ ఎఫెక్ట్..?
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఇవాళ జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.
Also Read:కాంగ్రెస్ కే క్లారిటీ లేదా?