రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని చర్చ..

406
pm modi
- Advertisement -

దేశవ్యాప్తంగా కోవిడ్-19 తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోమారు మాట్లాడనున్నారు. దేశంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, 21 రోజుల లాక్ డౌన్ తోపాటు పలు అంశాలపై ప్రధాని చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఆయా రాష్ట్రాల్లో ‘కరోనా’ పరిస్థితి, కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలు మొదలైన విషయాల గురించి ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం. అలాగే సీఎంలకు పలు సూచనలు కూడా చేయనున్నారు. కాగా, గత నెలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.

- Advertisement -