దేశం కోసం కుటుంబాన్ని వదిలేశానని, అన్నీ దేశం కోసం త్యాగం చేశానని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగంగా ప్రసగించారు . ఈ సమయంలో కంటి నుంచి వస్తున్న నీటిని తుడుచుకోవడం, అందరి హృదయాలనూ బరువెక్కించింది. గోవాలో ఇవాళ నూతన విమనాశ్రయానికి శంకుస్థాపన చేసిన తర్వాత మోడీ మాట్లాడారు.
నల్లధనం కోరల నుంచి నిజాయితీపరులైన పౌరులను కాపాడేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామన్నారు. బినామీ ఆస్తులు ఉన్న వాళ్ల మీద కూడా దాడులు చేయనున్నట్లు ప్రధాని అన్నారు. నేనేమీ అత్యున్నత పదవిని అనుభవించేందుకు పుట్టలేదు. పుట్టుకతోనే నా వద్ద డబ్బు లేదు. అధికారం లేదు. దేశ ప్రజల కోసం కుటుంబాన్ని, ఇంటిని కూడా త్యాగం చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం దేశ వ్యవస్థలో ఎలాంటి మార్పును తెస్తుందో నాకు తెలుసు. నల్లధన కుబేరుల వద్దనున్న ప్రతి పైసా దేశానికి చెందినదే. దేశ సంపదను కొల్లగొట్టిన వారిని గుర్తించి పట్టుకోవడమే మా బాధ్యత. కేంద్ర తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం.. నల్లధనం రూపుమాపడంతో కీలక పాత్ర పోషిస్తుంది. కొంతకాలం ఆగితే, దాని ప్రభావం ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. నాపై నమ్మకంతో కోట్ల మంది అండగా నిలిచారు. ఏమిచ్చి ప్రజల రుణం తీర్చుకోగలను?” అని మోదీ వ్యాఖ్యానించారు.
మంగళవారం రాత్రి 8 గంటలకు తీసుకున్న నిర్ణయంతో భారత ప్రజానీకం ప్రశాంతంగా నిద్రపోయింది. అయితే నల్లధనం దాచుకున్నవారు మాత్రం నిద్రలేని రాత్రి గడిపారు. తాను తీసుకున్న నిర్ణయానికి యావత్ దేశం బాసటగా నిలిచింది. ఇందుకు ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాను. పెద్దనోట్ల రద్దుతో చాలామంది పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా… అవన్నీ తాత్కాలికమే. అవినీతిని అంతమొందించడం, నల్లధనం నిర్మూలించాలన్న ప్రధాన లక్ష్యంతోనే కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు.
నల్లధనాన్ని భయటకు తెస్తమాన్నందుకే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, వాళ్లు ఎంతో ఆశిస్తున్నారని, అవినీతి నుంచి విముక్తి పొందేందుకు 2014లో ప్రజలు భారీ సంఖ్యలో తమకు ఓట్లు వేశారని మోడీ అన్నారు. నల్లధనం కోరల నుంచి నిజాయితీపరులైన పౌరులను కాపాడేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామన్నారు. బంగారు ఆభరణాల కొనుగోలుకు ప్యాన్ నంబర్‌ను తప్పనిసరి చేయరాదని అనేక మంది ఎంపీలు తనను కోరినట్లు మోడీ ఈ సందర్భంగా తెలిపారు.