తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే జాతీయరాజకీయాల దృష్టిని ఆకర్షించగా కాంగ్రెస్ నేతలు సోనియా,రాహుల్,బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్,మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నాని మోడీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగులో ట్వీట్ చేసిన మోడీ నేడు నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఎన్నికల ర్యాలీలో తాను పాల్గొంటున్నానని, ఈ సభ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.
నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెcట్టడానికి ఎంతో ఆసక్తిగా, ఎదురు చూస్తున్నాను… మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను… @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) November 27, 2018
నాందేడ్ నుండి నిజామాబాద్‌కు వెళ్లనున్న మోడీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారు. ఇక్కడ కూడా ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి నాలుగు గంటల సమయానికి హైదరాబాద్‌లోని బేగంపేటకు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను… NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) November 27, 2018