మీటూ..నా పేరు లేకపోవడం షాకే:వర్మ

248
ram gopal varma
- Advertisement -

ధనుంజయ్ హీరోగా ఐరా మోర్ హీరోయిన్‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌ణ‌లోఅభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మించిన చిత్రం ‘భైర‌వ‌గీత‌’. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆర్జీవీ.

పొద్దున లేస్తే తొడల గురించే మాట్లాడతా…నా పేరు లేనందుకు ఆశ్చర్యం కలగిస్తోందన్నారు వర్మ. నన్ను అలాంటి వాడు, ఇలాంటి వాడని అంటుంటారు. మీటూలో ఎంతోమంది పేర్లు బయటికొచ్చాయి కానీ నా పేరు మాత్రం బయటకు రాలేదు. బాలీవుడ్ ప్రముఖులను ఇది షాక్‌కు గురిచేసిందన్నారు.

మీటూ అనే పేరు వింటేనే ఇప్పుడు చాలా మంది గుండెలు జారిపోతున్నాయి. ఎక్క‌డ త‌మ పేరు బ‌య‌టికి వ‌స్తుందో అని చాలా మంది సెలెబ్రెటీలు వ‌ణికిపోతున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో మరి ఎక్కువ. ఈ నేపథ్యంలో వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -