రాష్ట్రానికి మోడీ…షెడ్యూల్ ఇదే

226
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రైల్వేలైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటారన్న నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో స్వాగత సభలో, తర్వాత రామగుండం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడ 20 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 2గంటలకు బేగంపేట విమనాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 3.05 గంటలకు రామగుండం ఎన్టీపీసీలో హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3.10 గంటలకు హెలిప్యాడ్ నుంచి ఆర్ఎఫ్సీఎల్ కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆర్ఎఫ్సీఎల్ కు చేరుకుంటారు. 3.35గంటలకు ఆర్ఎఫ్సీఎల్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు ఎన్టీపీసీ క్రీడా మైదానం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3.45 గంటల నుంచి 4.40 గంటల వరకు శిలాఫలకాల ఆవిష్కరణ, ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితం ప్రకటన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 4.45 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి 4.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -