Modi:మ‌ణిపూర్‌కు ప్ర‌ధాని మోదీ..

6
- Advertisement -

ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌లో పర్యటించనున్నారు. శ‌నివారం మ‌ణిపూర్‌లో ప్రధాని పర్యటించనున్నట్లు తెలిపారు అధికారులు. 2024 మే నెల‌లో మ‌ణిపూర్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర‌మైన హింస చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఆ రాష్ట్రాన్ని మొద‌టిసారి మోదీ విజిట్ చేయ‌నున్నారు.

మ‌ణిపూర్‌లోని చురాచాంద్‌పుర్‌లో సుమారు 7300 కోట్ల‌కు సంబంధించిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మ‌ణిపూర్ అర్బ‌న్ రోడ్స్‌, డ్రైనేజీ, అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం 3600 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. 2500 ఖ‌ర్చుతో అయిదు జాతీయ ర‌హ‌దారులు నిర్మించ‌నున్నారు. మ‌ణిపూర్ ఇన్‌ఫోటెక్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు, 9 ప్ర‌దేశాల్లో వ‌ర్కింగ్ వుమెన్స్ హాస్ట‌ల్స్ నిర్మాణం కోసం ప‌నులు ప్రారంభించ‌నున్నారు. ఇంపాల్‌లో సుమారు 1200 కోట్ల ఖ‌ర్చుతో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ఆవిష్క‌రించ‌నున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 71,850 కోట్ల ఖ‌రీదైన ప్రాజెక్టుల‌కు మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అలాగే గౌహ‌తిలో జ‌ర‌గ‌నున్న డాక్ట‌ర్ భూపెన్ హ‌జారికా శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో మోదీ పాల్గొంటారు. అస్సాంలో సుమారు 18,350 కోట్ల‌ విలువైన ప‌నుల‌కు ప్ర‌ఝ‌ధాని మోదీ శంకుస్థాప‌న చేస్తారు.

Also Read:ఉప ఎన్నికలు రావడం ఖాయం:జగదీష్ రెడ్డి

- Advertisement -