- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఇవాళ,రేపు జపాన్‌లో పర్యటించనున్న మోడీ…భారత్‌లో పెట్టుబడులపై చర్చించనున్నారు. అలాగే జపాన్‌లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీంతో పాటు 24న టోక్యోలో జరిగే క్వాడ్ సదస్సుకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అంశంపై ఆయా దేశాల అధ్యక్షులతో సమాలోచనలు జరపనున్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంత పరిణామాలు, సమకాలీన అంతర్జాతీయ సమస్యలు, క్వాడ్ దేశాల ఉమ్మడి అంశాలపై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.రష్యా, యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -