ఎఫ్‌3..వినోదాన్ని పంచడం ఖాయం

39
f3
- Advertisement -

విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక అందరిని ఆకట్టుకుంది. సినిమా యూనిట్ అంతా డ్యాన్స్‌, మాటలతో అలరించారు.

ఇక మూడేళ్ల తర్వాత ‘ఎఫ్‌ 3’గా వస్తున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు హీరో వెంకటేశ్‌. దర్శకుడు అనిల్‌ రావిపూడి మంచి స్క్రిప్ట్ అందించారని…. ఎఫ్‌ 3 అదిరిపోతుందిని చెప్పారు. ‘ఎఫ్‌ 3’తో దిల్‌రాజు ప్రొడక్షన్‌లో హ్యాట్రిక్‌ కొడతానని…. వెంకటేష్‌ తో రెండోసారి చేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు.

కరోనా తర్వాత ప్రేక్షకులను బాగా నవ్వించాలని చాలా కష్టపడ్డాం అని తెలిపారు అనిల్ రావిపూడి. ఎఫ్‌ 2 కంటే గొప్పగా ప్రేక్షకులు ఎఫ్‌ 3ని ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు నిర్మాత దిల్ రాజు. దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించారని వెల్లడించారు.

- Advertisement -