- Advertisement -
మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు నరేంద్ర మోడీ. ఇక మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు మోడీ.ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో 14న ప్రధాని మోడీ ఇటలీ వెళ్లనున్నారు. జీ7 సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇటలీ పీఎం జార్జియా మెలోని గత ఏప్రిల్ నెలలో ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ ఇటలీ వెళ్లనున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి.
Also Read:TTD:ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
- Advertisement -