ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో ఇవాళ పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ, అక్కడ నిర్వహించే ఓంకార మంత్ర పఠన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్వహించే ఆకట్టుకునే డ్రోన్ షోను వీక్షించనున్నారు.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సోమనాథ్ ఆలయ చారిత్రక ప్రాధాన్యత, భారత సాంస్కృతిక వారసత్వంపై ప్రధాని సందేశం ఇవ్వనున్నారు.
అదే రోజు రాజ్‌కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే అహ్మదాబాద్ మెట్రో రెండవ దశను కూడా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది నగర రవాణా వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వనుందని అధికారులు చెబుతున్నారు.
జనవరి 12న జర్మన్ ఛాన్సలర్ మెర్జ్‌తో కలిసి ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లో జరిగే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాల్గొని వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన గుజరాత్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం తీసుకువస్తుందని భావిస్తున్నారు.
Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

