ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రూ.15,718 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఉదయం 10.20 గంటలకు ప్రధాని హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం సమీపంలో శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఇందులో 800 మెగావాట్ల రామగుండం ధర్మల్ పవర్ ప్రాజెక్టు, యాదాద్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
ఆదిలాబాద్, బేల రెండు వరుసల రోడ్డు విస్తరణ పనులను, ఆదిలాబాద్ పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, ఇతర పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు పట్టణంలో పూర్తి బందోబస్తు ఏర్పాటుచేశారు.
Also Read:‘హనుమాన్’ ..గొప్ప ఆనందాన్నిచ్చింది