దక్షిణాదిన పాగా వేసేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్ వేశాడా ? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఫోకస్ అంతా కూడా సౌత్ పైనే ఉందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ, కేరళ రాష్ట్రాలపై మోడీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా కేరళ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికి ఆ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం అధికంగా ఉండడంతో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. ఇక ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలతో పోల్చితే బీజేపీ అట్టడుగు స్థానంలో ఉంటుంది. అయితే ఈసారి ఏపీలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటలని వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు కమలనాథులు. .
అందులో భాగంగానే ఏపీ, కేరళ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రెండు రోజులు పర్యటించనున్నారు. ఏపీలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని మోడీ. అలాగే కేరళలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే ఇంత సడన్ గా ఈ రెండు రాష్ట్రాల్లో మోడీ పర్యటన వెనుక రాజకీయ వ్యూహం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలతో పోల్చితే ఏపీ, కేరళ రాష్ట్రాలలోనే బీజేపీ అత్యంత బలహీనంగా ఉంది. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలను ఆకర్శించేందుకు ఎన్నికల ముందు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి మోడీ ప్రయత్నాలు పార్టీకి ఎంత మేర హెల్ప్ అవుతాయో చూడాలి.
Also Read:ఆ హీరో నిజంగానే కంటిచూపు కోల్పోయాడా?