అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌:మోడీ

20
- Advertisement -

హర్యానాలోని హిస్సార్ లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త ఎయిర్ పోర్టు టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం పచ్చ జెండా ఊపి అయోధ్యకు కమర్షియల్ ఫ్లయిట్ ను ప్రారంభించారు ప్రధాని.

2014కు ముందు దేశంలో 74 ఎయిర్ పోర్టులు ఉంటే, ఈరోజు 150 ఎయిర్ పోర్టులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు మోడీ. తమ ప్రభుత్వం పేదలకు సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.

హర్యానాలో పౌర విమానయాన రంగ అభివృద్ధికి కీలక ఘట్టంగా మారిందని తెలిపారు. .బీజేపీ తనకు హర్యానాలో పని చేసే బాధ్యత ఇచ్చినప్పుడు, పార్టీలోని అనేక మంది సహచరులతో కలిసి ఇక్కడ కృషి చేశాం అన్నారు. అందరి శ్రమతో హర్యానాలో బీజేపీని బలంగా నిలబెట్టామని అదే ఇప్పుడు వికసిత్ హర్యానా, వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేసేందుకు దోహదం చేసిందన్నారు. ఇవాళ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జన్మదినం. భారత రాజ్యాంగాన్ని రచించిన ఆయన జీవితం మరియు సందేశాలు, గత 11 సంవత్సరాలుగా మా ప్రభుత్వానికి ప్రేరణగా నిలిచాయి అన్నారు.

Also Read:అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు

కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎన్నిసార్లు అవమానించింది. ఆయనను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించేందుకు కుట్రలు చేసింది అని ఆరోపించారు మోడీ. ఆయనను వ్యవస్థకు దూరం చేయాలన్న యత్నాలు చేసింది కానీ మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, విధానం బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అంకితమైందని తెలిపారు.

- Advertisement -