ఇజ్రాయెల్ పర్యటనపై మోదీ ట్వీట్

4
- Advertisement -

ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరుతూ భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త లక్ష్యాలు నిర్ధేశిస్తామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల కీలక పర్యటనలో భాగంగా రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యమని చెప్పారు. గత 9 ఏళ్లలో ఇది ఆయన రెండో ఇజ్రాయెల్ పర్యటన. 2017 జూలైలో జరిగిన తొలి పర్యటనలో సంబంధాలు “స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్” స్థాయికి ఎదిగాయి.

బెంజిమన్ నెతన్యాహు Benjamin Netanyahu తో జరిపే చర్చల ద్వారా శాస్త్ర సాంకేతికం, ఆవిష్కరణలు, వ్యవసాయం, నీటి నిర్వహణ, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి విభిన్న రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ఆశిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన Knesset భవనాన్ని భారత త్రివర్ణ పతాక రంగులతో వెలుగులీనించడం ద్వారా గౌరవం తెలిపింది. క్నెసెట్ స్పీకర్ Amir Ohana ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మాజీ ప్రధాని Yair Lapid మోదీని “నిజమైన మిత్రుడు”గా అభివర్ణించారు.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

ఈ పర్యటనలో భారత్–ఇజ్రాయెల్ సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆధునిక రక్షణ వ్యవస్థల సంయుక్త అభివృద్ధి, అవసర సమయంలో పరస్పర మద్దతు వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి.

- Advertisement -