గత తొమ్మిదేళ్లుగా దేశానికి నరేంద్ర మోడి ప్రధానిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ ప్రధాని పదవి చేపడతానని మోడి చెబుతున్నారు. ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న మోడికి దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయన పాలనపై పెదవి విరుస్తున్నారు. ఈ తొమ్మిదేళ్లలో దేశ ప్రజలు గర్వించదగ్గ ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా జరగలేదని ప్రజలు తీవ్రంగా అసహనం గుప్పిస్తున్నారు. ఇంకా మోడి పాలనలో మత విద్వేషాలు పెరిగాయని, మత స్వతంత్రపు హక్కును మోడి సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెత్తి సామాన్యుడిపై నిత్యవసర ధరల భారం వేశారని మోడి పై మండి పడుతున్నారు. .
ఇక ఉద్యోగాలు సృష్టించడంలోనూ నిరుద్యోగాన్ని రూపు మాపడంలోనూ మోడి పూర్తి గా విఫలం అయ్యాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ మోడిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇక ఈ తొమ్మిదేళ్లలో మోడి నియంత పాలన సాగించారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ తొమ్మిదేళ్ల మోడి పాలనలో దేశ అవినీతిలో కూరుకుపోయిందని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
లక్షల కోట్ల దేశ సంపదను కార్పొరేటర్ల చేతిలో పెడుతూ స్వలాభం చూసుకుంటూ దేశభివృద్దిని గాలికి వదిలేశారని మోడిపై వేలెత్తి చూపిస్తున్నారు. ఇక దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మణిపూర్ తరహా ఘటనలు కనిపిస్తున్నాయంటే దానికి మోడి క్రూయల్ పాలిటిక్సే కారణం అని సామాన్యులు మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడికి బర్త్ డే విసెస్ చెబుతూనే ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు చాలమంది. దాంతో మోడి వేస్తున్న సెటైర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:KCR:దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ
On this #NationalUnemploymentDay,
let's not forget the record unemployment during Modi's tenure.It's baffling how BJP leaders seem oblivious to the alarming levels of joblessness and inflation in our nation.#राष्ट्रीय_बेरोजगार_दिवस pic.twitter.com/sDB3OoX0LD
— CongressLoksabhaMPTarget273+ (@Congress273Plus) September 17, 2023