రవి కుమార్ పోరాట పటిమ అత్యద్భుతం- ప్రధాని మోదీ

182
- Advertisement -

టోక్యో 2020 ఒలింపిక్స్ లో రెజ్లింగ్‌లో విభాగంలో భారత రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రవి కుమార్ దహియాను అభినందించారు. రవి కుమార్ దహియా ఒక అద్భుతమైన రెజ్లర్..అతని పోరాట పటిమ అత్యద్భుతం. రవి కుమార్ దహియా సాధించిన విజయం పట్ల దేశం గర్వపడుతుందన్న ప్రధాని ప్రశంసించారు.

ర‌వి కుమార్ ద‌హియా గురువారం 57 కేజీల విభాగంలో జ‌రిగిన ఫైన‌ల్లో ర‌ష్య‌న్ ఒలింపిక్ క‌మిటీకి చెందిన రెజ్ల‌ర్ జవుర్ ఉగుయెవ్ చేతిలో ర‌వి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సిల్వ‌ర్ గెలిచిన రెండో ఇండియ‌న్ రెజ్ల‌ర్‌గా అత‌డు నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు ఇది ఐదో మెడ‌ల్ కావడం విశేషం. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వ‌ర్ గెల‌వ‌గా.. బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్‌, హాకీలో మెన్స్ టీమ్ బ్రాంజ్ మెడ‌ల్స్ గెలిచిన విష‌యం తెలిసిందే.

- Advertisement -