జమిలి ఎన్నికలపై లాకమిషన్ కసరత్తు- కేంద్ర మంత్రి

97

జమిలి ఎన్నికలపై లాకమిషన్ కసరత్తు చేస్తోంది అన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు. బుధవారం లోక్‌సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు, రోడ్ మ్యాప్ రూపొందించే పనిని లా కమిషన్‌కి అప్పగించామని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో జమిలి ఎన్నికల గురించి సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘం సహా ఇందులో భాగస్వాములతో చర్చించాలని పేర్కొంది.

పదే పదే ఎన్నికల నిర్వహణ కారణంగా ఆర్థిక భారం, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యయాన్ని ఆయా రాష్ట్రాలు భరిస్తున్నాయి. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయని అన్నారు.