యాస్ తుఫాను బీభత్సం.. ప్రధాని మోదీ ఏరియల్ సర్వే..

145
pm modi
- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ శుక్రవారం యాస్ తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడి తూర్పు తీరంపై విరుచుకుపడిన యాస్ తుపానుతో అపార నష్టం కలిగింది. ఈ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. మొదట ఒడిశా సీఎంతో సమావేశం నిర్వహించిన మోదీ, ఆపై యాస్ తుఫానుతో అతలాకుతలం అయిన భద్రక్ జిల్లాను గగనతలం నుంచి పరిశీలించారు.

అనంతరం పశ్చిమ బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నపూర్ ప్రాంతంలోనూ ఏరియల్ సర్వే నిర్వహించి తుఫాను బీభత్సం మిగిల్చిన నష్టాన్ని పరిశీలించారు. అనంత‌రం ప్ర‌ధాని మోదీ ప‌శ్చిమబెంగాల్లో తుఫాను ప‌రిస్థితిపై అక్క‌డి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించ‌నున్నారు.

- Advertisement -