- Advertisement -
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. పునీత్ అకాల మరణం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పునీత్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే విధి ఆయనను మనకు దూరం చేసిందని, నటనా చాతుర్యం, అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ను రాబోయే తరాలు ఎన్నటికీ గుర్తుంచుకుంటాయని అన్నారు. పునీత్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన ట్వీట్ చేశారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -