Modi:ఓటేసిన ప్రధాని..

19
- Advertisement -

దేశ వ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 92 పార్లమెంట్ నియోజకవర్గాలు, 12 రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, గోవా, దాద్రానగర్ హవేలీ – దమణ్ దీవ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

గుజరాత్‌ గాంధీ నగర్ లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడిన మోడీ..ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది… దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందన్నారు. దేశ ప్రజలు ఎన్నికల ప్రక్రియను ఒక పండుగలా జరుపుకోవాలని వెల్లడించారు. ఓటు వేసిన తరువాత ప్రజలకు మోడీ అభివాదం చేయగా ఆయనతో కరచాలనం చేసేందుకు స్థానికులు పోటీ పడ్డారు. మోడీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -