- Advertisement -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనుండగా ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఆయన ఓటేశారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనున్నది. 780 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అయితే 36 మంది తృణమూల్ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నారు.
ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీపడుతున్నారు. అయితే ధన్‌కర్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన ఉద్దవ్ పార్టీలు మార్గరేట్ అల్వాకు మద్దతు ఇస్తున్నారు.
- Advertisement -