Ram Mandir:ప్రధాని ఆడియో సందేశం

21
- Advertisement -

అయోధ్య రామమందిరానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ నెల 22న రామమందిరాన్ని ప్రారంభించనుండగా మొదటి అంతస్తులో బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పులో ఈ తలుపును ఏర్పాటు చేశారు. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నారు.

ఇక ఇవాళ్టి నుండి అయోధ్యలో 11 రోజుల ప్రత్యేక ఆచారాలకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు, రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులు మిగిలి ఉన్నందున, ఆ శుభకార్యానికి సాక్షిగా ఉండడం తన అదృష్టమని వెల్లడించారు.

ఈ మేరకు ప్రజలకు ఆడియో సందేశాన్ని విడుదల చేస్తూ 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ తరుణంలో నా భావాలను మాటల్లో చెప్పడం చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.

Also Read:ఈ టైంలో నీళ్లు తాగండి..ఆరోగ్యంగా ఉండండి!

- Advertisement -