పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ప్రధాని మోదీకి వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు.
అంతకముందు పుట్టపర్తికి చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా స్మారకార్థం ప్రత్యేక స్మారక నాణెం, తపాలా బిళ్ల ఆవిష్కరణ చేయనున్నారు మోదీ.
పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9.2 కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహం ఏర్పాటు చేశారు. 31.8 అడుగుల ఎత్తయిన వెండి రథంలో ప్రతిష్టించి వేద మంత్రోచ్ఛారణల, సాయి నామస్మరణల మధ్య ఊరేగింపు జరుగగా రథం తయారీలో 180 కిలోల వెండి, పూతగా కిలో బంగారం వినియోగించారు.
Also Read:BB9:ఫ్యామిలీ వీక్..సర్‌ప్రైజ్

