- Advertisement -
ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని.
ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు మోదీ.ఉదయం 11.10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు ప్రధాని చేరుకున్నారు.
ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు సుందిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ రానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Also Read:అఖిలేశ్ ..ఫేస్‌బుక్ అకౌంట్ సస్పెండ్
- Advertisement -

