AP:ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

6
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటన దృష్ట్యా 3,300 బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

కర్నూలు జిల్లా నన్నూరులో ప్రధాని సభ కోసం 3,070 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పలు నియోజకవర్గాల నుంచి ప్రజల తరలింపునకు బస్సులు ఏర్పాటు చేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది కోసం 80 బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ.

16న కర్నూలు జిల్లాకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని.ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు మోదీ.ఉదయం 11.10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు ప్రధాని చేరుకున్నారు.

ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు సుందిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ రానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Also Read:నిధులన్ని ఖమ్మంకేనా?:కాంగ్రెస్ ఎమ్మెల్యే

- Advertisement -