న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ సోమవారం హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీకి ముందు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్, ఆయన సతీమణి కరోలిన్ పార్మెలిన్ రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. భారత్-ఇఎఫ్టిఎ (India-EFTA TEPA) భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రధాని మోదీతో జరిగే భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలను విభిన్న రంగాలలో విస్తరించేందుకు దోహదపడుతుందనే ఆశాభావాన్ని విదేశాంగ మంత్రి వ్యక్తం చేశారు.
Also Read:ఎన్నారై బీఆర్ఎస్ యూకే..విస్తృత సమావేశం
మూడు రోజుల భారత పర్యటనలో (అక్టోబర్ 5 – 7) భాగంగా ఇరు దేశాల నేతలు వర్తకం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్కృతి వంటి వివిధ అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై విస్తృతంగా చర్చించారు.

