బిగ్ బాస్ తెలుగు ఇంట్లో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కింది. నామినేషన్స్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్ మధ్య జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. వీరి మధ్య జరిగిన గొడవలో వర్షిణి, ముఖేష్, రోహిత్ తదితరులు కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను ‘రోడ్ టు రీలోడ్’ థీమ్‌లో భాగంగా విభిన్నంగా నిర్వహించారు. బాక్సుల్లో దాచిన పండును గుర్తించిన కంటెస్టెంట్‌కు నామినేట్ చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్.. అమన్‌ను నామినేట్ చేశాడు. గతంలో జరిగిన ఫిజికల్ టాస్క్‌లో త్రిగుణ్ గాయపడిన ఘటనను ప్రస్తావిస్తూ అమన్‌పై ప్రశ్నలు సంధించాడు.
దీనిపై అమన్ తనదైన రీతిలో సమాధానం ఇవ్వడంతో త్రిగుణ్ కూడా చర్చలోకి వచ్చాడు. “ఆయన మొదలు పెడితే నేను ముగించాను” అంటూ అమన్ చెప్పగా.. ఈ వ్యవహారంపై కంటెస్టెంట్ల మధ్య వాదన కొనసాగింది. సంచాలకుల నిర్ణయాలపై కూడా చర్చ జరగడంతో పలువురు కంటెస్టెంట్లు ఇందులోకి వచ్చారు.
మరోవైపు ముఖేష్.. గత వారం అపూర్వ కెప్టెన్‌గా వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు లేవనెత్తాడు. దీనికి అపూర్వ కూడా గట్టిగానే స్పందించింది. వర్షిణి సైతం అపూర్వను ప్రశ్నిస్తూ.. ఆమె కెప్టెన్సీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో వీరి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.
ఇక త్రిగుణ్, అపూర్వ మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. రోహిత్ పేరును ప్రస్తావిస్తూ త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా వివాదం చెలరేగింది.
Also Read:స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో మోదీ
మొత్తంగా చూస్తే ఈ వారం నామినేషన్స్‌లో త్రిగుణ్, అమన్, షాలినీ, చరణ్, అపూర్వ, రోహిత్, రామ్ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఎవరు సేఫ్ అవుతారు? అనేది ప్రేక్షకుల ఓట్లపై ఆధారపడి ఉంటుంది.

