Modi: ఫోగట్‌పై వేటు బాధాకరం

4
- Advertisement -

ఓవర్ వెయిట్ కారణంగా పారిస్ ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని కొల్పోయింది రెజ్లర్ వినేశ్ ఫోగట్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వినేశ్‌, నువ్వ చాంపియ‌న్ల‌కే చాంపియ‌న్‌ అంటూ కొనియాడారు. భార‌త దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నావ‌ని తెలిపారు.

నిజానికి వేటు ప‌డ‌డం ఎంతో బాధిస్తుంద‌ని… చాలా నిరాశ‌కు లోన‌య్యాన‌ని, ఆ విష‌యాన్ని మాట‌ల్లో చెప్ప‌లేమ‌న్నారు. నువ్వు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో రాణిస్తావ‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. అంద‌రం స‌పోర్టుగా ఉంటామ‌ని వెల్లడించారు.

50 కేజీల ఫ్రీ స్ట‌యిల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫోగ‌ట్‌…ఫైన‌ల్‌కి చేరింది. అయితే నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అధికంగా ఉండటంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. అధిక బ‌రువు న‌మోదు కావ‌డంతో.. ఆమెపై వేటు విధించారు. దీంతో భార‌త ఒలింపిక్ బృందంలో నిరాశ‌లు నెల‌కొన్నాయి.

Also Read:Paris Olympics: వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు

- Advertisement -