Modi:ద్వారాక ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

25
- Advertisement -

హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 2019, మార్చి 9వ తేదీన ఆనాటి మంత్రులు సుష్మా స్వ‌రాజ్‌, అరుణ్ జైట్లీ, నితిన్ గ‌డ్క‌రీలు శంకుస్థాప‌న చేశారు. ద్వారాక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం సుమారు 4100 ఖ‌ర్చు చేశారు. దీని ద్వారా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు క‌నెక్టివిటీ పెర‌గ‌నుంది. ఈ కార్యక్రమంలో హ‌ర్యానా చీఫ్ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టార్, మంత్రి గ‌డ్క‌రీ పాల్గొన్నారు.

దీని ద్వారా ఎన్‌హెచ్‌-28 రూట్లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వ‌ర‌కు ట్రాఫిక్ చిక్కులు త‌ప్ప‌నున్నాయి. ద్వార‌క ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడుగు 29 కిలోమీట‌ర్లు. దీంట్లో హ‌ర్యానాలో 18.9 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇక మిగితా 10.1 కిలోమీట‌ర్ల దూరం ఢిల్లీ కింద‌కు వ‌స్తుంది.ద్వార‌కా ఎక్స్‌ప్రెస్‌వే 8 లేన్ల ఉన్న అర్బ‌న్ ర‌హ‌దారి. దీన్ని సుమారు 9 వేల కోట్ల ఖ‌ర్చుతో నిర్మించారు. వాస్త‌వానికి ఈ ప్రాజెక్టు మొత్తానికి సుమారు 60 వేల కోట్లు కేటాయించారు.

Also Read:క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం

- Advertisement -