పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 20వ విడుత నిధుల విడుదలకు అంతా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. 20వ విడత కోసం లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించండి
Farmers Corner సెక్షన్‌లో ‘Beneficiary Status’ మీద క్లిక్ చేయండి
మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ నమోదు చేయండి
Submit క్లిక్ చేస్తే – మీ చెల్లింపు చరిత్ర మరియు 20వ విడత అర్హత స్థితి కనిపిస్తుంది
పీఎం కిసాన్ యోజన కింద నమోదైన రైతులకు 20వ విడత చెల్లింపుని పొందేందుకు eKYC తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
మీరు eKYCని అధికారిక వెబ్‌సైట్‌లో OTP వేరిఫికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా మీ సమీప CSC (Common Service Centre)కు వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా పూర్తి చేయవచ్చు.
PM కిసాన్ యోజన కోసం eKYCని ఇలా పూర్తి చేయండి:
pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
‘Update Mobile Number’ పై క్లిక్ చేయండి
మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ వివరాలు నమోదు చేయండి
మీ ఆధార్-లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది
ఆ OTPను నమోదు చేసి eKYCని పూర్తి చేయండి
డిసెంబర్–మార్చి 2024–25 కాలంలో దాదాపు 10 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. 19వ విడతను ఫిబ్రవరి 24, 2025న విడుదల చేశారు.
Also Read:తత్కాల్ టికెట్ బుకింగ్..ఆధార్ తప్పనిసరి

