- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు.
గత రెండు రోజులుగా యాత్రికులు క్యూలో ఉండడంతో వారికి ఆహారం అందడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల్లో యాత్రికులు టీటీడీకి రావద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు. యాత్రికులకు ఆహారం, నీరు అందిస్తున్నామని చెప్పినా… గంటలకు పైగా క్యూలో వేచి ఉండడంతో తమకు ఆహారం దొరకడం లేదని యాత్రికులు వాపోతున్నారు. ఇక చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలంటే ఓ వారం తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్.
- Advertisement -