- Advertisement -
కరోనా నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ వేదికగా మరో పిలుపునిచ్చారు కరోనా నుండి కోలుకున్న పేషెంట్స్ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా వారియర్స్ ఇప్పుడు సేవియర్స్‌గా ఉండాలని….ఈ కష్ట కాలంలో ఇంత కన్నా గొప్ప మానవత్వం ఉండదన్నారు. ఫ్లాస్మా దానం చేసి జీవితాలు కాపాడాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కోవిడ్ 19 నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీసులు పిలుపునిచ్చిన నేపథ్యంలో చిరంజీవి స్పందించారు.
- Advertisement -