- Advertisement -
భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడో రోజు, శుక్రవారం ఆటంతా టీమిండియాదే. రహానె (48), కోహ్లీ (41), భువి (33), షమి (27), మురళీ విజయ్ (25) రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. అంతకు ముందు దక్షిణాఫ్రికా ఆధిక్యం 7 పరుగులను మినహామిస్తే లక్ష్యం 240.
అయితే అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై ఆతిథ్య జట్టుకు ఈ లక్ష్య ఛేదనేమీ సులభం కాదు! రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది. ఓపెనర్ డీఎన్ ఎల్గర్ (11 బ్యాటింగ్) తలకు బంతి తగలడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. పిచ్ భయంకరంగా స్పందిస్తుండటంతో బంతులు అనూహ్యంగా బౌన్స్ అవుతున్నాయి. ఆ తర్వాత వర్షం పడటంతో ఆటను ముగించారు.
- Advertisement -