రాణు మోండల్ పై సోషల్ మీడియాలో సెటైర్లు

483
Ranu Mondal New Pic

అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయిపోవచ్చు అనే సామెత ఈమెకు కరెక్ట్ గా సరిపోతుంది. రైల్వే ప్లాట్ ఫాంపై పాటలు పాడుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రాణు మోండల్ రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై..’ పాట తన జీవితాన్ని మార్చేసింది. రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రయాణికుడు ఆమె పాడుతునప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆమె ఇండియాలోనే ఫేమస్ సింగర్ గా ఎదిగిపోయారు.

చాలా మంది సింగర్ లు ఆమె సాంగ్ కు ఫిదా అయిపోయారు. తాజాగా ఆమె చేసిన పనికి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు రాణు మోండల్. ఎయిర్ పోర్టులో ఓ అభిమాని ఆమె చెయ్యి తాకి సెల్పీ అడిగినందుకు ఆమెపై సీరియస్ అయ్యింది రాణు మోండల్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిక్షగత్తెగా ఉన్న ఆమెను విమానంలో పంపిస్తే అలాగే ఉంటుందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకోసం తన ముఖానికి ఎక్కువగా మేకప్ వేసుకున్నారు. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎక్కువగా మేకప్ వేసుకున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

PlatForm Singer Ranu Mondal Pic Viral in Social Media